రూమర్స్ పై ప్రశ్నకు దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చిన సమంతా.!

Published on Sep 18, 2021 4:00 pm IST

మన టాలీవుడ్ లో ఉన్నటువంటి అగ్ర శ్రేణి హీరోయిన్స్ లో స్టార్ హీరోయిన్ సమంతా కూడా ఒకరు. కెరీర్ స్టార్టింగ్ లో మంచి హిట్స్ అందుకొని స్టార్ట్ స్టేటస్ తెచ్చుకున్నాక మరిన్ని ఛాలెంజింగ్ రోల్స్ చేస్తూ సామ్ ఆడియెన్స్ ని ఆకట్టుకుంటుంది. ఓపక్క సినిమాలతో పాటుగా ఓటిటి లో కూడా తన హవాని చూపిస్తున్న సామ్ వ్యక్తిగత జీవితంకి సంబంధించి గత కొన్నాళ్లుగా పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

మన వ్యక్తిగత జీవితం అంటే ఏమో కానీ పక్క వాళ్ళ లైఫ్ లో ఏం జరుగుతుందో తెలుసుకోవడం అన్నది కొంతమందికి బాగా అలవాటేగా అలా సామ్ చైతూల దాంపత్య జీవితంపై పడ్డారు. అది వారి జీవితం వారిష్టం అవి పక్కన పెడితే ఒక ఊహాగానాలు మొదలయ్యాయి. దానికి వారు రీసెంట్ గానే సమాధానం కూడా ఇచ్చారు.

అయినా కూడా ఇంకా అదే ప్రశ్న సామ్ ను వేధించింది. తాజాగా తాను తిరుమల దేవస్థానంకి దర్శనార్ధం వెళితే ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకి గాను చెంప చెళ్లుమనెలా ఆన్సర్ ఇచ్చింది. “గుడికి వచ్చి ఇలా అడుగుతున్నావ్ బుద్ధి ఉందా?” అంటూ సాలిడ్ ఆన్సర్ ఇచ్చింది అంతే.. దీనితో ఒక్క సమాధానం సోషల్ మీడియాలో ఒక్క లెక్కలో వైరల్ అవుతుంది.

సంబంధిత సమాచారం :