‘మా ఇంటి బంగారం’కు భలే ఛాన్స్.. సమంత వినియోగించుకుంటుందా..?

స్టార్ బ్యూటీ సమంత స్వీయ నిర్మాణంలో నటించిన ‘మా ఇంటి బంగారం’ చిత్రం ఎట్టకేలకు జూన్ 19న విడుదలకు సిద్ధమవుతోంది. నిజానికి ఈ సినిమా మే నెలలోనే రావాల్సి ఉన్నప్పటికీ, సరైన ప్రమోషన్ టైమ్ కోసం సామ్ భర్త రాజ్ నిడిమోరు సలహాతో వాయిదా వేశారు. అదే సమయంలో తమిళంలో సూర్య ‘కరుప్పు’ బ్లాక్‌బస్టర్ కావడం, నైజాంలో సింగిల్ స్క్రీన్ వివాదాలు నడుస్తుండటంతో.. ఆ సమయంలో తప్పుకుని సమంత సేఫ్ గేమ్ ఆడిందనే చెప్పాలి.

ప్రస్తుతం థియేటర్లలో ఉన్న రామ్ చరణ్ ‘పెద్ది’ చిత్రానికి మంచి రెస్పాన్స్ లభిస్తోంది. అయితే ‘పుష్ప 2’ లాంటి మాస్ సినిమా కాకపోవడంతో రెండు వారాల తర్వాత దీని రన్ నెమ్మదించే అవకాశం ఉంది. ఇది జూన్ 19న రాబోయే ‘మా ఇంటి బంగారం’ సినిమాకు కలిసివచ్చే అంశం. అదే సమయంలో విడుదలవుతున్న గీతా ఆర్ట్స్ ‘దీవానా’ ఇంటెన్స్ లవ్ స్టోరీ కావడంతో సమంత చిత్రానికి పెద్దగా పోటీ ఉండకపోవచ్చు.

అయితే, వారం తిరక్కుండానే జూన్ 26న అఖిల్ ‘లెనిన్’ చిత్రం బరిలోకి దిగుతోంది. ఈ లోపే ‘మా ఇంటి బంగారం’ సినిమాకు థియేటర్లలో పాజిటివ్ టాక్ వస్తే, ఎంత పోటీ ఉన్నా బాక్సాఫీస్ వద్ద నిలదొక్కుకోవడం ఖాయం. ముఖ్యంగా కెరీర్ పరంగా ఈ సినిమా హిట్ కావడం దర్శకురాలు నందిని రెడ్డికి ఎంతో అవసరం. మరి ఈ ఛాన్స్‌ను సమంత ఎలా వినియోగించుకుంటుందో చూడాలి.

Exit mobile version