నాగార్జున హర్రర్ సినిమాలో సమంత!


సౌతిండియన్ సినిమాలో స్టార్ హీరోయిన్లలో ఒకరైన సమంత, ఇప్పుడు అక్కినేని కుటుంబంలోని వ్యక్తి అన్న విషయం కూడా తెలిసిందే. నాగార్జున తనయుడు నాగ చైతన్య, సమంత ఈ మధ్యే నిశ్చితార్థంతో ఒక్కటై తమ రెండేళ్ళ ప్రేమ బంధాన్ని ముందుకుతీసుకెళ్ళారు. ఇక అక్కినేని ఫ్యామిలీ హీరోల సినిమాల్లో ఇప్పటికే పలుమార్లు నటించిన సమంత, తాజాగా నాగార్జున చేస్తోన్న ‘రాజు గారి గది 2’లోనూ భాగం కానున్నారట. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్ళేందుకు సిద్ధమవుతోంది.

నిశ్చితార్థం తర్వాత సమంత ఒప్పుకున్న మొదటి సినిమా ఇదే కావడం విశేషంగా చెప్పుకోవాలి. పీవీపీ సినిమా నిర్మిస్తోన్న ఈ సినిమాకు ఓంకార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఓంకార్ దర్శకత్వంలోనే రూపొంది 2015లో విడుదలై సూపర్ హిట్‌గా నిలిచిన ‘రాజుగారి గది’కి సీక్వెల్‌గా రాజుగారిగది 2 తెరకెక్కుతోంది. డిఫరెంట్ జానర్ సినిమాలు చేయాలన్న ఆలోచనతోనే ఈ హర్రర్ కామెడీ చేస్తున్నట్లు ఈ సినిమాను ఒప్పుకునేముందే నాగార్జున స్పష్టం చేశారు.