ఎన్టీఆర్‌ షోలో సమంత సందడి చేయబోతుందా?

Published on Oct 7, 2021 11:10 pm IST

అక్కినేని నాగచైతన్య-సమంతల విడాకుల వ్యవహారం ఇండస్ట్రీలో ఇప్పుడు హాట్ టాఫిక్‌గా మారిన సంగతి తెలిసిందే. అసలు ఈ జంట విడిపోవడానికి అసలు కారణం ఏమై ఉంటుందా అని అంతా ఆలోచనల్లో పడ్డారు. అయితే నాగ చైతన్య, సమంతలు మాత్రం ఈ విషయాన్ని మరిచిపోయి వారి వారి పనుల్లో బిజీ అయిపోయినట్టు తెలుస్తుంది. ఇప్పటికే నాగ చైతన్య లవ్ స్టోరీ సినిమాకి సంబంధించి సక్సెస్ మీట్స్, ఇంటర్వ్యూలు వంటి కార్యక్రమాల్లో బిజీగా ఉండగా, త్వరలో జరగనున్న “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్” ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య అతిధిగా కూడా వెళ్లబోతున్నారు.

ఇదిలా ఉంటే విడాకుల అనంతరం సమంత ఇప్పటివరకు నేరుగా ఎలాంటి కార్యక్రమాల్లో పాల్గొనలేదు. అయితే తాజాగా సమంత ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న ఎవరు మీలో కోటీశ్వర్లు షోలో కనిపించబోతోంది అంటూ ప్రచారం జరుగుతోంది. ఆమెకు సంబంధించిన ఎపిసోడ్‌ కూడా ఇప్పటికే షూటింగ్‌ పూర్తయ్యిందని టాక్. అంతేకాదు ఈ స్పెష‌ల్ ఎపిసోడ్ ఈ నెల చివ‌ర‌లో కానీ లేక వ‌చ్చే నెలలో కానీ ప్రసారమయ్యే అవకాశాలు ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

సంబంధిత సమాచారం :