మహా నటి సావిత్రి నిజ జీవితంలో సమంత !

10th, December 2016 - 04:10:48 PM

samantha

‘ఎవడే సుబ్రహ్మణ్యం’ సినిమాతో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ త్వరలో ఓ వినూత్న ప్రాజెక్టుకి శ్రీకారం చుట్టనున్నారు. అదే మహానటి సావిత్రి జీవితాన్ని తెరపై ఆవిష్కరించడం. ఎప్పటి నుండో ఈ కథపై వర్కవుట్ చేస్తున్న నాగ్ అశ్విన్ పూర్తి స్థాయి స్క్రిప్ట్ తయారు చేయడానికి రీసెర్చ్ చేసి బాగానే కష్టపడ్డాడు. అయితే ఈ ప్రాజెక్ట్ తయారవుతుందనే వార్త బయటకు రాగానే ఎంతో మంది హీరోయిన్ల పేర్లు వినిపించాయి.

చివరికి వాటన్నినీటినే కాదంటూ స్టార్ హీరోయిన్ సమంత సావిత్రి పాత్రను చేస్తుందని బలమైన వార్తలు సినీ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్నాయి. పైగా కొన్నిరోజుల క్రితం త్వరలో నేను చేయబోయే సరికొత్త, ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ గురించి మీకు చెప్తాను అంటూ సమంత చేసిన ట్వీట్ వలన కూడా ఈ వార్త ఖచ్చితంగా నిజమే అయ్యుంటుందని అంటున్నారు. ఇకపోతే ఈ సావిత్రి బయోపిక్ ని నాగ్ అశ్విన్ భార్య, అశ్విని దత్ కుమార్తె నిర్మించనున్నారు.