అప్పుడే అసలు స్వభావం బయటపడుతుంది – సమంత

Published on Nov 1, 2021 8:18 pm IST

హీరోయిన్‌ సమంత సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. ఈ మధ్య ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ పై మరింతగా ఫోకస్‌ పెట్టింది. సమంత తాజాగా మరో ఎమోషనల్‌ పోస్టును షేర్‌ చేసింది. ‘మనిషి ఒత్తిడిలో ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాలే మనమేంటో తెలియజేస్తాయి. తట్టుకోలేని ఒత్తిడికి గురైన సమయంలోనే మనిషి అసలు స్వభావం బయటపడుతుంది’ అంటూ రచయిత రాబ‌ర్ట్ రాసిన కొటేష‌న్‌ ను ఇన్‌స్టా స్టోరీలో నెటిజన్లతో షేర్ చేసుకుంది.

అయితే, సమంత పోస్ట్‌ చేసిన ఈ మెసేజ్ సోషల్‌ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఇక నాగ చైతన్యతో విడాకుల అనంతరం.. సమంత చార్‌ ధామ్‌ యాత్రకు వెళ్లి వచ్చింది. అలాగే చార్‌ ధామ్‌ యాత్ర తర్వాత దుబాయ్‌ ట్రిప్‌ కు వెళ్ళింది. ఇక సమంత సినిమాలతో బిజీ అయిపోయింది. ప్రస్తుతం సమంత రెండు సినిమాలు అంగీకరించిందని తెలుస్తోంది.

సంబంధిత సమాచారం :