సమంత వ్యాధి పై నాగబాబు ఎమోషనల్ పోస్ట్ !

సమంత వ్యాధి పై నాగబాబు ఎమోషనల్ పోస్ట్ !

Published on Oct 31, 2022 12:00 PM IST

హీరోయిన్ సమంత కు myositis వ్యాధి సోకిన సంగతి తెలిసిందే. ఐతే, సామ్ వ్యాధిపై పలువురు సినీ ప్రముఖులు ఆమెకు ధైర్యం చెబుతూ వరుస ట్వీట్‌ లు పోస్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలో మెగా బ్రదర్ నాగబాబు కూడా స్పందించారు. ‘‘సమంతతో నేను ఎప్పుడు నేరుగా మాట్లాడలేదు. అయినప్పటికీ.. సమంత మయోసైటిస్‌ అనే వ్యాధితో బాధపడుతోందని తెలిసి నా మనసు బాధ పడింది.

సమంత త్వరగా కోలుకోవాలని, ఆమె మళ్లీ దృఢంగా తిరిగి రావాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను. సమంత స్వతంత్ర మహిళ. సమంత చాలా శక్తి సామర్థ్యాలు కలిగిన అమ్మాయి. తను ఆశావాద వ్యక్తి. మయోసైటిస్ నుంచి సామ్ పూర్తిగా కోలుకోవాలని మరొక్కసారి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’’అంటూ నాగాబాబు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

అలాగే, ఈ తరంలో ఉన్న గొప్ప నటీమణుల్లో సమంత ఒకరని, ఆమెను మరెన్నో గొప్ప పాత్రల్లో ప్రేక్షకులు చూడాలనుకుంటున్నారని నాగబాబు తన లెటర్ లో పేర్కొన్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు