రేపటి నుండి షూటింగ్లో పాల్గొననున్న సమంత !
Published on Apr 2, 2017 8:10 pm IST


‘ధృవ’ చిత్రంతో భారీ విజయానందుకున్న రామ్ చరణ్ తేజ్ తాజాగా సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమాని మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. పూర్తి గ్రామీణ నైపథ్యంలో సాగే ఈ కథలో చరణ్ మునుపెన్నడూ లేని విధంగా చాలా కొత్తగా కనిపించనున్నాడు. ఈ చిత్రం యొక్క రెగ్యులర్ షాట్ నిన్నటి నుండే రాజమండ్రిలోని ఒక గ్రామాలో మొదలైంది. 31రోజుల ఈ భారీ షెడ్యూల్ గోదావరి జిల్లాలోని పలు ప్రాఅంతాల్లో జరగనుంది. ఇకపోతే ఈ షూటింగ్లో హీరోయిన్ సమంత రేపటి నుండి పాల్గొననున్నట్లు తెలుస్తోంది.

రేపు సమంత, చరణ్ ఆ మీద శేఖర్ మాస్టర్ సారథ్యంలో ఒక పాటను షూట్ చేయనున్నారు. ‘జనతాగ్యారేజ్’ సమంత సైన్ చేసిన భారీ తెలుగు ప్రాజెక్ట్ ఇదే. అంతేగాక ‘మహానటి, రాజుగారి గది 2’ వంటి చిత్రాల్లో కూడా సమంత నటించనుంది. ఇకపోతే మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో జగపతిబాబు, ఆది పినిశెట్టిలు పలు కీలక పత్రాలు పోషిస్తుండగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, రత్నవేలు సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహించనున్నారు.

 
Like us on Facebook