వైరల్‌గా మారిన సమంత లేటెస్ట్ గ్లామరస్ స్టిల్..!

Published on Apr 1, 2022 2:09 am IST

అక్కినేని ఫ్యామిలీతో తన బంధాన్ని తెంచుకున్న తర్వాత సమంత గ్లామర్ విషయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గడంలేదు. సాధారణంగా పెళ్లి, విడాకుల వంటి వాటి తర్వాత హీరోయిన్లకు క్రేజ్ తగ్గ్గుతుంటుంది. కానీ సమంత విషయంలో అది పూర్తిగా తప్పని తేలింది. విడాకుల అనంతరం వరుస సినిమాలతో బిజీగా మారిన సమంత ఇటు సోషల్‌ మీడియాలోనూ మరింత యాక్టివ్‌ అయ్యింది. సమంతకి సంబంధించి ఎలాంటి ఫోటోలైనా, పోస్టులైనా క్షణాల్లో వైరల్ అయిపోతున్నాయి. ఇక ఈ మధ్య కమర్షియల్ ఫోటో షూట్‌లకు కూడా సమంత గట్టిగానే ఫోజులిస్తుంది.

అయితే రీసెంట్‌గా కాస్మోపోలిటన్ అనే మ్యాగజైన్‌కి ఫోటోషూట్ నిర్వహించిన సమంత ఆ మ్యాగజైన్ కవర్ పేజిపై ఎవరూ ఊహించని స్థాయిలో హాట్‌గా కనిపిస్తుంది. సమంత గ్లామర్‌ని చూసిన అభిమానులు ఇందులో మరింత అందంగా ఉందని ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సంబంధిత సమాచారం :