లేటెస్ట్ : తన మాయోసైటిస్ ట్రీట్మెంట్ పై లేటెస్ట్ అప్ డేట్ ఇచ్చిన సమంత

Published on Feb 12, 2023 2:21 am IST


టాలీవుడ్ స్టార్ కథానాయికల్లో ఒకరైన సమంత రూత్ ప్రభు ఇటీవల కొన్నాళ్లుగా మాయోసైటిస్ అనే ఇమ్యూనీ వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. కాగా ఆ వ్యాధికి ఇప్పటికే కొన్ని నెలలుగా డాక్టర్స్ నుండి చికిత్స తీసుకుంటున్న సమంత, తాజా తన హెల్త్ పై ఒక అప్ డేట్ అందించారు. ప్రస్తుతం తాను మాయోసైటిస్ నెలవారీ చికిత్స ఐవీఐజి (ఇంట్రావీనస్ ఇమ్యునో గ్లోబలీన్ థెరపీ) లో భాగంగా చికిత్స తాలూకు సెషన్ కి హాజరైనట్లు ఆమె తెలిపారు. దానిని తన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ షేర్ చేస్తూ న్యూ నార్మల్ అని ఆమె తెలిపారు.

ఈ థెరపీ ద్వారా ఇమ్యూనిటీ సిస్టం మరింతగా బలపడడంతో పాటు ఇకపై ఎటువంటి ఇన్ఫెక్షన్ తో కూడిన వ్యాధుల బారిన పడకుండా ఆమె ఈ చికిత్స తీసుకుంటున్నారు. దాదాపుగా 2 నుండి 4 గంటల పాటు సమయం పట్టె ఈ చికిత్సని సమంత ప్రస్తుతం ఇంట్లోనే తీసుకుంటున్నారు. అలానే దానితో పాటు ఆమె తన వ్యాయామాలను ఏమాత్రం మానలేదు. కష్టపడాలని, కష్టం అని తెలిసినా విడవకుండా కష్టపడితే ఫలితం తప్పక ఉంటుందని ఆమె మరొక పోస్ట్ లో తెలిపారు. మొత్తంగా తమ అభిమాన కథానాయిక చాలా వరకు కోలుకుంటూ ఉండడంతో పలువురు సమంత ఫ్యాన్స్ ఆమె మరింత త్వరలో కోలుకోవాలని కోరుతూ సోషల్ మీడియాలో గెట్ వెల్ సూన్ మేడం అంటూ మెసేజస్ చేస్తున్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :