సినీ పరిశ్రమల్లో ప్రస్తుతం ‘మీటూ’ ఉద్యమం రోజుకొక రకంగా మలుపు తిరుగుతుంది. ఇప్పటికే కొందరు నటీమణులు తమకు ఎదురైన చేదు సంఘటనలు వేధింపులను బాహాటంగానే చెబుతున్నారు. తనుశ్రీ దత్తా – నానా పటేకర్ వివాదంతో మొదలైన ఈ ‘మీటూ’ ఉద్యమానికి చాలామంది సినీ ప్రముఖులు తమ మద్దతును ప్రకటించారు.
అయితే ఈ ఉద్యమం పై గతంలోనే స్పందించి మద్దతు ప్రకటించిన అక్కినేని సమంత.. తాజాగా మరోసారి ‘మీటూ’ ఉద్యమం పై స్పందిస్తూ లైంగిక వేధింపులు ఎదుర్కొన్న వారందరూ భయపడకుండా ధైర్యంగా తెలపాలని కోరారు. ఈ సందర్భంగా ఆమె ట్వీట్ చేస్తూ.. ‘‘లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా మీ వాయిస్ తెలపండి. మీరు ఎవరో చెప్పకపోయినా సరే.. మీరిచ్చిన వాయిస్ మాత్రం ప్రపంచానికి వినిపిస్తోంది అని కింద మెయిల్ ఐడీస్ ఇస్తూ
complaints@telugufilmchamber.in
complaints@apfilmchamber.com లకు ఫిర్యాదు చేయండి సమంత పోస్ట్ చేశారు.
అలాగే, మీరు పోస్టు ద్వారా వ్యక్త పరచాలనుకుంటే..
Panel against sexual harassment
Dr D రామానాయుడు బిల్డింగ్
ఫిలింనగర్, హైదరాబాద్
తెలంగాణ 500096 ఈ అడ్రస్ కు మీ అనుభవాలను పంపించండి’ అని సమంత పోస్ట్ చేశారు.
Speak up against sexual harassment
Your voice will be heard even if it is anonymous Complain to –
complaints@telugufilmchamber.in
complaints@apfilmchamber.com
Postal address
Panel against sexual harassment
Dr D Ramanaidu Building
Filmnagar Hyderabad
TELANGANA 500096 #MeToo pic.twitter.com/iDz02nnJ4c— Samantha Akkineni (@Samanthaprabhu2) October 14, 2018