ఫస్ట్ సింగిల్ అప్డేట్‌తో కన్ఫ్యూజన్ క్లియర్ చేసిన సమంత

Maa-Inti-Bangaaram

స్టార్ హీరోయిన్ సమంత లీడ్ రోల్‌లో నటిస్తున్న తాజా చిత్రం ‘మా ఇంటి బంగారం’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. రాజ్‌ నిడిమోరుతో వివాహం తర్వాత ఆమె నుండి వస్తున్న మొదటి సినిమా ఇది. నందినీ రెడ్డి దర్శకత్వంలో ఫ్యామిలీ క్రైమ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా విడుదలపై తాజాగా క్లారిటీ వచ్చింది.

రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమా ఏప్రిల్ 30 రేసు నుండి తప్పుకోవడంతో, సమంత సినిమా ఆ తేదీకి వస్తుందని ప్రచారం జరిగింది. కానీ, మేకర్స్ ఆ వార్తలను పటాపంచలు చేస్తూ, సినిమాను ముందుగా అనుకున్నట్లుగానే మే 15, 2026న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రమోషన్లలో భాగంగా ఏప్రిల్ 16న సంతోష్ నారాయణన్ స్వరపరిచిన ‘తస్సాదియ్యా’ అనే ఫ్యామిలీ పార్టీ సాంగ్‌ను విడుదల చేయనున్నారు.

ట్రలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై సమంత, హిమాంక్ రెడ్డి, రాజ్ & డికె ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో గుల్షన్ దేవయ్య, సత్యరాజ్, గౌతమి, శ్రీముఖి తదితరులు నటిస్తున్నాు. మరి ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ దక్కుతుందో చూడాలి.

Exit mobile version