సమంత, నయనతార మల్టీస్టారర్ ఓటీటీలోకి !

Published on Oct 2, 2021 11:11 pm IST

విజయ్ సేతుపతి హీరోగా, సమంత, నయనతార హీరోయిన్లుగా దర్శకుడు విగ్నేష్ శివన్ దర్శకత్వంలో ‘కథు వాకుల రెండు కాదల్’ అనే సినిమా వస్తోంది. పైగా నయనతారనే నిర్మాత. కాగా తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా ఓటీటీలో విడుదల కాబోతుందని వార్తలు వస్తున్నాయి. ట్రయాంగిల్ లవ్ స్టోరీగా రూపొందిన ఈ సినిమా పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.

ప్రముఖ ఓటీటీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో రిలీజ్ చేసేందుకు చర్చలు సాగుతున్నాయని.. అన్నీ అనుకున్నట్టు జరిగితే నవంబర్ 4 నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌ లో ఈ సినిమా స్ట్రీమింగ్ కాబోతుందని తెలుస్తోంది. మరి ఈ వార్తలో ఎంత నిజం ఉందో చూడాలి. ఇప్పటివరకు అయితే మేకర్స్ నుంచి దీనికి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

సంబంధిత సమాచారం :