చైతూ – మారుతి సినిమాలో సమంత నో ఛాన్స్!
Published on Oct 5, 2017 5:42 pm IST

ప్రస్తుతం నాగ చైతన్య – సమంత పెళ్లి మూడ్ లో ఉన్నారు 6, 7 తేదీల్లో హిందూ, క్రిస్టియన్ సంప్రదాయాల్లో వారి పెళ్లి గోవాలో లో జరగనుంది. ఇప్పుడు వారి ఫామిలీస్ తో పాటు వారు కూడా మంచి హ్యాపీ మూడ్ లో ఉన్నారు. మ్యారేజ్ తర్వాత సమంత, చైతూ మరల వారి సినిమాల మీద ద్రుష్టి పెట్టనున్నారు.

ఈ నేపధ్యంలో చైతూ, మారుతి దర్శకత్వంలో ఒక సినిమాకి కమిట్ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో సమంతని హీరోయిన్ గా తీసుకోవాలని మారుతి ప్రయత్నించినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ సినిమాలో హీరోయిన్ సమంత కాదని, ఇంకా ఎవరనేది ఫైనల్ చేయలేదని తెలుస్తుంది. ఈ సినిమా కథ పెళ్ళైన తర్వాత భార్య, భర్తల మధ్య వచ్చే ఇగో సమస్యల మీద బేస్ చేసుకొని ఉంటుందని సమాచారం.

 
Like us on Facebook