ఎన్టీఆర్, రామ్ చరణ్ సినిమా పై క్లారిటీ ఇచ్చిన సమంత !



ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో కలిసి రాజమౌళి ఓ భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’ను తెరకెక్కించబోతున్న విషయం తెలిసిందే. ‘బాహుబలి’ తరవాత ఆయన చేస్తున్న సినిమా కావడం, ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తుండటంతో ఈ సినిమా పై ఆరంభం నుండి రకరకాల ఊహా గానాలు, వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. అలాంటి వార్త ఒకటి ఎప్పటినుంచో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తూనే ఉంది. వివరాల్లోకి వెళ్తే ‘ఆర్ఆర్ఆర్’లో హీరోయిన్ గా సమంత నటిస్తుందనేది ఈ వార్త సారాంశం.

కాగా, తాజాగా సమంత ‘యూ టర్న్’ సినిమా సంబంధించిన ఇచ్చిన ఇంటర్వ్యూలో.. రాజమౌళి సినిమా గురించి అడిగినప్పుడు, ఆమె ఈ చిత్రంలో నటించటంలేదని చాలా స్పష్టంగా వెల్లడించింది. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రంలో నేను హీరోయిన్ గా నటిస్తున్నానని వస్తున్న వార్తల్లో మరియు హీరోయిన్ పాత్రను రిజెక్ట్‌ చేశానని గతంలో వచ్చిన వార్తలు.. పూర్తిగా అవాస్తవం అని సమంత తెలిపారు. ఇక ‘ఆర్ఆర్ఆర్’కి సంబంధించి తాజా సమాచారం ప్రకారం ప్రీ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతుంది. ఈ ఏడాది చివర్లో చిత్రబృందం సెట్స్ పైకి వెళ్లనున్నారు.