పార్టీలతో ఎంజాయ్ చేస్తోన్న చైతూ, సమంత..!
Published on Nov 6, 2016 11:32 am IST

sam-nagachaitanya
అక్కినేని హీరో నాగ చైతన్య, సౌతిండియన్ స్టార్ హీరోయిన్ సమంత ఇద్దరూ చాలాకాలంగా ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. వచ్చే ఏడాది పెళ్ళి చేసుకోనున్న ఈ ప్రేమ జంట ఇప్పటికి తమ రిలేషన్‌షిప్‌లో ఒకరి ఇష్టాలను ఒకరు పంచుకుంటూ సరదాగా కాలం గడుపుతున్నారు. ఇక నిన్న సాయంత్రం ఈ జంట, అఖిల్ జంటతో కలిసి వీకెండ్ పార్టీ చేసుకున్నారు. అక్కినేని అఖిల్ కూడా కొద్దికాలంగా శ్రేయా అనే హైద్రాబాద్‌కు చెందిన యువతితో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ రెండు జంటలూ కలిసి వీకెండ్ పార్టీని పెద్ద ఎత్తున చేసుకున్నారు.

ఇదే విషయాన్ని ట్విట్టర్ ఎకౌంట్ ద్వారా పంచుకుంటూ సమంత తన ఆనందాన్ని వెలిబుచ్చారు. ఫ్యామిలీతో కలిసి పార్టీ ఎంజాయ్ చేశానని తెలుపుతూ సమంత ఓ ఫోటో కూడా పోస్ట్ చేశారు. ఈ ఫోటోలో అక్కినేని హీరోలిద్దరూ తమ గర్ల్‌ఫ్రెండ్స్‌తో చూడముచ్చటగా కనిపించడం చూడొచ్చు. ఈ జంటల్లో అఖిల్ జంట త్వరలోనే పెళ్ళి చేసుకుంటూండగా, నాగచైతన్య-సమంత మాత్రం కెరీర్‌పైనే దృష్టి పెట్టి మరో ఏడాది వరకూ పెళ్ళి చేసుకోవద్దని నిర్ణయించుకున్నారు.

 
Like us on Facebook