సమంత ఐటెమ్ సాంగ్‌కి 20 రోజుల్లో 100 మిలియన్ వ్యూస్..!

Published on Dec 31, 2021 1:07 am IST

టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ సమంత “పుష్ప” సినిమాలో ఐటం సాంగ్ చేసిన సంగతి తెలిసిందే. “ఊ అంటావా మామ.. ఊఊ అంటావా” అని సాగే ఈ పాట యూట్యూబ్ ని షేక్ చేస్తుంది. ఈ సాంగ్‌లో సమంత చేసిన హాట్ స్టెపులు అభిమానులకు పిచ్చెకించాయి. అయితే తాజాగా ఈ సాంగ్ యూట్యూబ్‌లో కొత్త రికార్డును సృష్టించింది.

డిసెంబర్ 10వ తేదిన విడుదలైన ఈ పాట 100 మిలియన్ వ్యూస్‌ని సాధించింది. కేవలం 20 రోజుల్లోనే ఈ రికార్డును నమోదు చేసింది. దీంతో సామ్ అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. ఇదిలా ఉంటే చంద్రబోస్ ఈ పాటకు లిరిక్స్ అందించగా, సింగర్ ఇంద్రావతి ఆలపించింది. దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందించారు.

సాంగ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :