ఆ అవసరం నాకు లేదు – సమంత

Published on Dec 12, 2021 4:20 pm IST


నాగచైతన్యతో తన విడాకులకు సంబంధించిన అంశం పై తనకు మళ్లీ మళ్లీ స్పందించాలనే ఆసక్తి గానీ, ఇష్టం గానీ లేదని సమంత తాజాగా స్పష్టం చేసింది. సామ్ రీసెంట్ గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మొదటిసారి తన విడాకుల వ్యవహారంపై స్పందించింది. చైతుతో విడిపోయిన సమయంలో ఎంతో మానసిక కుంగుబాటుకు లోనయ్యానని, ఓ దశలో చనిపోవాలనుకున్నానని కూడా సమంత షాకింగ్ కామెంట్స్ చేసింది.

అలాగే 2021వ సంవత్సరం తనకి వ్యక్తిగతంగా ఏ రకంగానూ కలిసి రాలేదని సమంత ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. అయితే, చైతుతో తన విడాకుల అంశం పై సమంత స్పందిసూ.. ‘‘మేమిద్దరం విడిపోవడంపై చాలా మంది చాలా రకాలుగా అనుకున్నారు. అయితే ఆ మొత్తం వ్యవహారంపై నా అభిప్రాయాన్ని నేను ఇప్పటికే చెప్పడం జరిగింది.

కాబట్టి, మళ్లీ మళ్లీ ఆ అంశం పై మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు’ అని సమంత చెప్పుకొచ్చింది.

సంబంధిత సమాచారం :