“పుష్ప” సాంగ్ కోసం సామ్ కి రికార్డ్ రెమ్యునరేషన్..?

Published on Nov 16, 2021 7:06 am IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా దర్శకుడు సుకుమార్ తొలిసారిగా పాన్ ఇండియన్ లెవెల్లో ప్లాన్ చేసిన చిత్రం “పుష్ప”. అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో రీసెంట్ గా స్టార్ హీరోయిన్ సమంతా ఓ ఐటమ్ సాంగ్ లో చేస్తుంది అని బజ్ రాగా అది నిజమే అంటూ మేకర్స్ నిన్ననే అనౌన్స్ చేశారు. ఇక ఈ తర్వాత నుంచి ఈ సాంగ్ పై మరింత ఆసక్తిగా మారింది.

అయితే ఇప్పుడు ఈ క్రేజీ సాంగ్ కి సామ్ భారీ స్థాయి రెమ్యునరేషన్ తీసుకున్నట్టుగా తెలుస్తోంది. మరి లేటెస్ట్ టాక్ ప్రకారం ఈ సాంగ్ కి సమంత 1.5 కోట్లు తీసుకుందట. ఇది సౌత్ ఇండియా లోనే ఓ హీరోయిన్ కి రికార్డ్ రెమ్యూనరేషన్ అని తెలుస్తోంది. ఇక ఈ సాంగ్ ని కూడా దేవి అదిరే లెవెల్లో కంపోజ్ చెయ్యగా దీనిని చిత్ర యూనిట్ ఐదవ సాంగ్ గా రిలీజ్ చేయనున్నారు. ఇక బిగ్ స్క్రీన్ పై ఈ స్పెషల్ ఐటమ్ నంబర్ ఎలా ఉంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం :

More