సమంత, రాజ్ నిడుమోరుతో పరిచయం తనలో మార్పు తీసుకొచ్చింది అంటూ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి. ఇంతకీ సామ్ ఏం మాట్లాడింది అంటే.. ‘వివాహ బంధం నుంచి బయటకు వచ్చిన తర్వాత నాకు నేను మరింత దగ్గరయ్యాను. ఆ సమయంలో ఇక ఎవరిపైనా ఆధారపడటం, విశ్వసించడం సాధ్యం కాదేమోననిపించింది. ఎందుకంటే ఆ రకమైన ప్రేమ, స్నేహం ఆమోదించేంత బలంగా నేను లేను’ అంటూ సమంత చెప్పుకొచ్చింది.
సమంత ఇంకా మాట్లాడుతూ.. ‘కానీ, రాజ్ నిడుమోరుతో పరిచయం, రిలేషన్‌షిప్ తర్వాత నాలో చాలా మార్పు వచ్చింది. అందుకు కారణం రాజే. సూర్యోదయాన్ని ఆస్వాదించటం, ధ్యానం చేయటం, నాతో నేను ఎక్కువ సేపు గడపడం. రాజ్‌ను కలవకముందు నా దినచర్య ఇలాగే ఉండేది. ఆయనతో పరిచయం మార్పును తెచ్చింది. నేను, రాజ్ అన్ని పనులు కలిసి చేయాలనుకుంటాం. ఇక నటన పరంగానూ నాలో ఎంతో మార్పు వచ్చింది’ అని సమంత తెలిపింది.
