లేటెస్ట్..సమంత “శాకుంతలం” రిలీజ్ డేట్ ఫిక్స్.!

Published on Sep 23, 2022 10:56 am IST

ప్రస్తుతం మన టాలీవుడ్ నుంచి రాబోతున్న మరిన్ని ఇంట్రెస్టింగ్ మరియు పాన్ ఇండియా ప్రాజెక్ట్ లలో దర్శకుడు గుణశేఖర్ మరియు స్టార్ హీరోయిన్ సమంత కాంబోలో తెరకెక్కిస్తున్న భారీ పీరియాడిక్ చిత్రం “శాకుంతలం” కూడా ఒకటి. మంచి అంచనాలు నెలకొల్పుకున్న ఈ చిత్రాన్ని చాలా కాలం గ్యాప్ తర్వాత గుణశేఖర్ స్టార్ట్ చేయగా దీనిపై మంచి అంచనాలు మొదటి నుంచి స్టార్ట్ అయ్యాయి.

ఇక ఇదిలా ఉండగా మేకర్స్ అయితే ఇప్పుడు ఫైనల్ గా ఈ భారీ సినిమా రిలీజ్ డేట్ పై అయితే అప్డేట్ అందించారు. ఈ చిత్రాన్ని మేకర్స్ ఈ నవంబర్ 4న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నట్టు ఓ సాలిడ్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. మరి ఇందులో సమంత హీరో పాత్రదారుడు దేవ్ మోహన్ కనిపిస్తుండగా బ్యాక్గ్రౌండ్ లో గుణశేఖర్ మార్క్ భారీ సెట్ కూడా కనిపిస్తుంది. ఇక ఈ భారీ సినిమాకి మణిశర్మ సంగీతం అందిస్తుండగా దిల్ రాజు మరియు గుణశేఖర్ లు భారీ వ్యయంతో నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :