ఓటిటి స్ట్రీమింగ్ కి వచ్చేసిన “యశోద”.!

ఓటిటి స్ట్రీమింగ్ కి వచ్చేసిన “యశోద”.!

Published on Dec 9, 2022 9:00 AM IST

సౌత్ స్టార్ హీరోయిన్ సమంత మెయిన్ లీడ్ లో నటించిన లేటెస్ట్ అవైటెడ్ చిత్రం “యశోద” కోసం అందరికీ తెలిసిందే. మరి దర్శకులు హరి అండ్ హరీష్ లు తెరకెక్కించిన ఈ చిత్రం సమంత కెరీర్ లో భారీ హిట్ గా నిలిచి 33 కోట్లకి పైగా వసూళ్లు అందుకుంది. మరి దీనితో ఈ చిత్రం అయితే థియేటర్స్ లో సక్సెస్ గా రన్ కంప్లీట్ చేసుకున్నాక నెక్స్ట్ ఇప్పుడు ఓటిటి లో ట్రీట్ ఇవ్వడానికి రెడీ అయ్యింది.

మరి ఈ చిత్రాన్ని అమేజాన్ ప్రైమ్ వీడియో వారు సొంతం చేసుకోగా ఇందులో అయితే ఈ చిత్రం ఈరోజు నుంచే అందుబాటులోకి వచ్చేసింది. తెలుగు సహా హిందీ, తమిళ్ మరియు కన్నడ మళయాళ భాషలలో ఈ చిత్రం ఇప్పుడు స్ట్రీమింగ్ కి వచ్చేసింది. మరి అప్పుడు కానీ మిస్ అయ్యిన వారు ఇప్పుడు చూసినా మంచి థ్రిల్లింగ్ ట్రీట్ సమంత సాలిడ్ పెర్ఫామెన్స్ తో అదరగొడుతుంది అని చెప్పాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు