టీజర్ రిలీజ్ కి రెడీ అవుతోన్న సమంత ‘శాకుంతలం’….?

Published on Jul 11, 2022 10:00 pm IST

సమంత మెయిన్ లీడ్ లో నటిస్తున్న లేటెస్ట్ మూవీ శాకుంతలం. భారీ సినిమాల దర్శకుడు గుణశేఖర్ తీస్తున్న ఈ ప్రతిష్టాత్మక మూవీలో సమంత శకుంతల పాత్ర చేస్తుండగా దేవ్ మోహన్ దుశ్యంతుడిగా నటిస్తున్నారు. శకుంతల, దుశ్యంతుల కథగా మైథలాజికల్ మూవీగా రూపొందుతున్న శాకుంతలం నుండి ఇప్పటికే రిలీజ్ అయిన సమంత ఫస్ట్ లుక్ అందరినీ ఎంతో ఆకట్టుకుంది.

గుణ టీమ్ వర్క్స్ బ్యానర్ పై దిల్ రాజు సమర్పణలో ఎంతో భారీ వ్యయంతో అత్యున్నత సాంకేంతిక విలువలతో రూపొందుతున్న శాకుంతలం మూవీకి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. కాగా ప్రస్తుతం షూటింగ్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ టీజర్ ని త్వరలో రిలీజ్ చేసేందుకు యూనిట్ రెడీ అవుతోందట. కబీర్ బేడీ, మోహన్ బాబు, అదితి బాలన్, ప్రకాష్ రాజ్, అనన్య నాగళ్ళ తదితరులు ఇతర రోల్స్ చేస్తున్న శాకుంతలం మూవీ ఈ ఏడాది చివరిలో రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత సమాచారం :