సమంత ‘శాకుంతలం’ మూడవ సాంగ్ రిలీజ్ డేట్ ఫిక్స్

Published on Jan 31, 2023 12:39 am IST

సమంత, దేవ్ మోహన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ శాకుంతలం. శకుంతల, దుష్యంతుల కథగా ఆకట్టుకునే కథ కథనాలతో భారీ సినిమాల దర్శకుడు గుణశేఖర్ ఎంతో గ్రాండ్ లెవెల్లో రూపొందించిన ఈ మూవీ నుండి ఇప్పటికే రిలీజ్ అయిన రెండు సాంగ్స్ తో పాటు థియేట్రికల్ ట్రైలర్ కూడా ఎంతో ఆకట్టుకుని మూవీ పై అందరిలో ఎన్నో అంచనాలు ఏర్పరిచాయి.

మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ మూవీకి శేఖర్ వి జోసెఫ్ డీవోపీ గా వర్క్ చేస్తున్నారు. మోహన్ బాబు, అదితి బాలన్, గౌతమి, సచిన్ ఖేడేకర్, అనన్య నాగళ్ళ, ప్రకాష్ రాజ్ వంటి వారు కీలక పాత్రలు చేస్తున్న ఈ పాన్ ఇండియన్ మైథలాజికల్ మూవీ నుండి ఏలేలో ఏలేలో అనే పల్లవితో సాగే మూడవ సాంగ్ ని ఫిబ్రవరి 1న విడుదల చేయనున్నట్లు మేకర్స్ కొద్దిసేపటి క్రితం ప్రకటించారు. ఇక శాకుంతలం మూవీని అన్ని కార్యక్రమాలు ముగించి ఫిబ్రవరి 17 న పలు భాషల్లో భారీ స్థాయిలో రిలీజ్ చేయనున్నారు.

సంబంధిత సమాచారం :