“ది ఫ్యామిలీ మ్యాన్2” షూటింగ్ గ్యాప్ లో సమంత ఏం చేస్తుందో చూడండి!

Published on Jul 14, 2021 4:00 pm IST

సినిమాలకు ధీటుగా వెబ్ సిరీస్ లు భారత్ లో సంచలనం సృష్టిస్తున్నాయి. అయితే ది ఫ్యామిలీ మ్యాన్ కి సీక్వెల్ గా వచ్చిన ది ఫ్యామిలీ మ్యాన్ 2 లో టాలివుడ్ టాలెంటెడ్ బ్యూటీ సమంత రాజీ పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ విడియో ద్వారా విడుదల అయి దేశ వ్యాప్తంగా ప్రేక్షకులని విశేషం గా ఆకట్టుకుంటుంది.

అయితే ఈ వెబ్ సిరీస్ లో సమంత సీరియస్ గా ఉండే రాజీ పాత్రలో నటించింది. అయితే ఈ పాత్ర పోషించడం పట్ల విమర్శకుల నుండి సమంత ప్రశంసలు అందుకున్నారు. అయితే షూటింగ్ మధ్య లో సమంత సెట్స్ లో ఎలా ఉండేదో ఒక వీడియో ను తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది. పాట పాడుతూ, డాన్స్ చేస్తూ ఉన్న విడియో ను షేర్ చేసింది. అయితే ఇప్పుడు ఆ వీడియో నెటిజన్ల ను విశేషంగా ఆకట్టుకుంటుంది.

సంబంధిత సమాచారం :