తన హెల్త్ పై షాకింగ్ న్యూస్ రివీల్ చేసిన సమంత.!

తన హెల్త్ పై షాకింగ్ న్యూస్ రివీల్ చేసిన సమంత.!

Published on Oct 29, 2022 4:00 PM IST

ఒక్క మన టాలీవుడ్ లోనే కాకుండా సౌత్ సహా పాన్ ఇండియా మార్కెట్ లో కూడా స్టార్ హీరోయిన్ సమంత ఇప్పుడు సత్తా చాటుతుంది. తన సినిమాలతో మాత్రమే కాకుండా పలు వెబ్ సిరీస్ లతో కూడా ఆకట్టుకుంటున్న సామ్ ఇప్పుడు “యశోద” అనే పాన్ ఇండియా సినిమా రిలీజ్ తో సిద్ధంగా ఉంది. అయితే లేటెస్ట్ గా ఈ సినిమా ట్రైలర్ కూడా రాగా దీనికి భారీ రెస్పాన్స్ కూడా వచ్చింది.

మరి దీనికి థాంక్స్ చెప్తూ సమంత పెట్టిన లేటెస్ట్ పోస్ట్ షాకింగ్ గా మారింది. ఇందులో సమంత గత కొన్నాళ్లుగా కండరాల సంబంధిత మాయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్నాని అయితే ఇది ఇప్పుడే చెప్పకూడదు అనుకున్నాను కానీ దీని నుంచి తీసుకుంటున్న ట్రీట్మెంట్ తో పూర్తిగా కోలుకోడానికి మరికాస్త సమయం పడుతుందని డాక్టర్స్ చెప్పారని.

అందుకే ఇప్పుడే చెప్తున్నానని అయితే దీని నుంచి ఖచ్చితంగా నేను కోలుకుంటానని డాక్టర్స్ తెలిపారని నాకు మానసికంగా అలాగే శారీరికంగా కూడా మంచి రోజులూ ఉన్నాయి చెడ్డ రోజులు కూడా ఉన్నాయి. ఖచ్చితంగా దీని నుంచి కూడా నేను పాస్ అవుతానని సమంత తెలిపింది. దీనితో సామ్ నుంచి ఈ ఊహించని పోస్ట్ అభిమానుల్లో షాకింగ్ గా మారగా ఆమె త్వరగా కోలుకోవాలని వారు కోరుకుంటున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు