స్టార్ బ్యూటీ సమంత లీడ్ రోల్ లో నటించిన తాజా చిత్రమే “మా ఇంటి బంగారం”. తన హిట్ దర్శకురాలు నందిని రెడ్డితో చేసిన మూడో సినిమా ఇది కాగా దీనికి ఊహించని రెస్పాన్స్ ఇపుడు వరల్డ్ వైడ్ నమోదు కావడం క్రేజీగా మారింది. నిజానికి ఈ సినిమా ఈ రేంజ్ లో వసూళ్లు రాబడుతుంది అని చాలా మంది ఊహించి కూడా ఉండకపోవచ్చు. యూఎస్ మార్కెట్ లో 6 కోట్లకి పైగా ఓపెనింగ్స్ వస్తే వరల్డ్ వైడ్ ఓపెనింగ్స్ లో ఇవే సగం మేర ఉన్నాయి.
దీనితో సమంత డామినేషన్ ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. అంతే కాకుండా మన టైర్ 2 హీరోస్ రేంజ్ లో ఈ సినిమా బుకింగ్స్ అదరగొడుతున్నాయి. ఈ వీకెండ్ శనివారం ప్రతీ గంటకి 15 వేలకి పైగా టికెట్ సేల్స్ జరగడం అనేది ఓ హీరోయిన్ సినిమాకి చిన్న విషయం కాదు. ఇలా సమంత సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్లో డామినేట్ చేస్తూ బాక్సాఫీస్ దగ్గర వీర బాదుడు బాదుతుంది. ఇదే మూమెంటం కంటిన్యూ అయితే మాత్రం తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ గ్రాసర్ గా (సోలో సినిమాల్లో) నిలిచినా ఎలాంటి ఆశ్చర్యం లేదు.
