నయనతార కి సమంత స్పెషల్ బర్త్ డే విషెస్!

Published on Nov 18, 2021 5:32 pm IST

నవంబర్ 17 వ తేదీన నయనతార పుట్టిన రోజు సందర్భంగా జరిగిన బర్త్ డే పార్టీ కి సమంత హాజరు అయ్యారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదిక గా అందుకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ బర్త్ డే విషెస్ తెలిపారు సమంత. ఆమె వచ్చింది, ఆమె చూసింది, ఆమె ధైర్యం చేసింది, ఆమె కలలు కన్నది, ఆమె ప్రదర్శించింది, జయించింది అంటూ సమంత చెప్పుకొచ్చారు. అయితే పుట్టిన రోజు శుభాకాంక్షలు నయన్ అంటూ క్వీన్ గా సంబోధించారు సమంత.

సమంత బర్త్ డే విషెస్ సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. విఘ్నేష్ శివన్ దర్శకత్వం లో వస్తున్న కతువాకుల రెండు కాదల్ చిత్రం లో విజయ్ సేతుపతి, నయనతార, సమంత లు నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం డిసెంబర్ నెలలో విడుదల కానుంది. ఈ చిత్రానికి అనిరుద్ రవి చందర్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :