ఆ ప్రత్యేక నేత కార్మికుల కోసం అండగా సమంతా.!

Published on Oct 24, 2021 3:03 pm IST

మన టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతా ఇప్పుడు తన జీవితంలో ఓ స్టెప్ తీసుకొని తన పని తాను చేసుకుంటూ వెళుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సమంతా కాశ్మీర్ లో తన వెకేషన్ ని గడుపుతూ తన సోషల్ మీడియాలో వాటిని పంచుకుంటుంది కూడా. అయితే సామ్ తన ప్రొఫిషినల్ లైఫ్ కాకుండా పర్సనల్ గా కూడా పలు సేవా కార్యక్రమాలు చేస్తుంది అని తెలిసిందే. అలా కూడా సామ్ ని అమితంగా అభిమానించే వారు ఉన్నారు.

అయితే ఇప్పుడు సామ్ మళ్ళీ తన వంతు అయ్యింది కాశ్మీర్ కి చెందిన ‘దూసల’ అనే చేనేత వస్త్రాలు వాటిని పరంగా నేసే ఈ కార్మికుల కోసం అండగా నిలబడింది. అక్కడ ఉన్న కొద్ది రోజులూ ఆ నేత దుస్తులు ధరించి అవెలా ఉన్నాయి తనకి ఎలా అనిపించింది అనే ఎక్స్ పీరియన్స్ లను తన ఇన్స్టా స్టోరీస్ ద్వారా తెలిపింది. అంతే కాకుండా ఈ దూసల నేత కార్మికులకు సపోర్ట్ చేసి అండగా నిలవాలని తన ఫాలోవర్స్ తో వారికోసం పంచుకుంది.

సంబంధిత సమాచారం :