“యశోద” తో తన స్టార్ పవర్ ను నిరూపించిన సమంత

“యశోద” తో తన స్టార్ పవర్ ను నిరూపించిన సమంత

Published on Nov 14, 2022 10:17 PM IST

సౌత్ స్టార్ హీరోయిన్ సమంత అస్వస్థతకు గురికావడంతో విడుదలకు ముందు అంతగా ప్రచారం జరగని చిత్రం యశోద. ఆమె ఒక్క ఇంటర్వ్యూ మాత్రమే ఇచ్చింది. యశోద కోసం తాను ఇచ్చిన ఒక్క ఇంటర్వూ అభిమానులను కట్టి పడేసింది. గత శుక్రవారం విడుదలైన ఈ చిత్రం మంచి రివ్యూలను అందుకుంది. సినిమా మౌత్ టాక్ పెరిగిన విధానం, వారాంతంలో కలెక్షన్లు సమంత స్టార్ పవర్‌కు నిదర్శనం అని చెప్పాలి.

ఈ చిత్రం యూ ఎస్ లో 400కే డాలర్ల మార్క్‌ను దాటింది. మొదటి మూడు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో 4 కోట్లకు పైగా షేర్ సాధించింది. వీక్ డేస్ స్టార్ట్ కావడంతో ఈరోజు నుంచి ఈ సినిమాకి పరీక్ష జరగనుంది. అయితే ఈ సినిమా త్వరలోనే లాభాల్లోకి రావడంతో మేకర్స్ మాత్రం కలెక్షన్స్ విషయం లో చాలా హ్యాపీగా ఉన్నారు. ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమా అయినా సమంతకు ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా ఉందని, ప్రేక్షకులను థియేటర్‌కి రప్పించగలదని ఈ విజయం మరోసారి రుజువు చేసింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు