సూపర్ స్టైలిష్ గా సమంత కొత్త సిరీస్ లో లుక్.!

Published on Feb 1, 2023 12:07 pm IST

సమంత మెయిన్ లీడ్ లో నటించిన లేటెస్ట్ అవైటెడ్ చిత్రం అయినటువంటి “శాకుంతలం” రిలీజ్ కి రెడీగా ఉండగా సినిమాలతో పాటుగా తనకి ఎంతో క్రేజ్ తెచ్చిపెట్టిన ఓటిటి లో కూడా ఆమె పలు సిరీస్ లను ఆమె చేస్తుంది. మరి అలా చేసిన లేటెస్ట్ సిరీస్ లలో “సిటాడెల్” కూడా ఒకటి. మరి తన మొదటి సిరీస్ ఫ్యామిలీ మ్యాన్ 2 దర్శకులు రాజ్ అండ్ డీకే లు దర్శకత్వం వహించిన ఈ సిరీస్ లో వరుణ్ ధావన్ నటిస్తుండగా ఇందులో సమంత కీలక పాత్ర చేస్తుంది.

అయితే మేకర్స్ ఈరోజు సామ్ నుంచి ఆమె లుక్ ని రిలీజ్ చేశారు. మరి ఇందులో మాత్రం సామ్ కంప్లీట్ డిఫరెంట్ చాలా స్టైలిష్ గా ఉందని చెప్పాలి. దీనితో ఈ రోజు తన ఫ్యాన్స్ ఈ సూపర్ స్టైలిష్ క్లిక్ చూసి అయితే మెస్మరైజ్ అవుతున్నారు. మరి ఈ సిరీస్ ని అమెజాన్ ప్రైమ్ వీడియో వారు రిలీజ్ అతి త్వరలోనే స్ట్రీమింగ్ కి తీసుకురానుండగా ఈ సిరీస్ మంచి స్పై థ్రిల్లర్ గా అయితే రాబోతుంది.

సంబంధిత సమాచారం :