ప్రియాంక చోప్రా కి సమంత అక్కినేని థాంక్స్…ఎందుకంటే?

Published on Sep 20, 2021 3:00 am IST

కాతు వాకుల్ రెండు కాదల్ చిత్రం నుండి తాజాగా విడుదల అయిన టు టు టు మ్యూజికల్ వీడియో సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది. యూ ట్యూబ్ లో సైతం ట్రెండ్ అవుతుంది. తాజాగా ఈ పాట ప్రముఖ బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా ను ఆకట్టుకుంది. ఈ పాట తనకు బాగా నచ్చింది అని, బాగా చేశారు అంటూ చెప్పుకొచ్చారు. అంతేకాక చిత్ర దర్శకుడు విగ్నేష్ శివన్ పుట్టిన రోజు సందర్భంగా బర్త్ డే విషెస్ తెలిపారు. చిత్ర యూనిట్ కి కంగ్రాట్స్ అంటూ చెప్పుకొచ్చారు ప్రియాంక చోప్రా.

అయితే ఈ చిత్రం లో లీడ్ రోల్ లో నటిస్తున్న సమంత అక్కినేని, ప్రియాంక చేసిన వ్యాఖ్యల పట్ల స్పందించారు. మీ వ్యాఖ్యలు మా టీమ్ కి చాలా ఎంకరేజ్ మెంట్ అంటూ చెప్పుకొచ్చారు. థాంక్ యూ ప్రియాంక అంటూ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. విగ్నేష్ శివన్ దర్శకత్వం లో విజయ్ సేతుపతి, నయనతార, సమంత అక్కినేని ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న ఈ కాతు వాకుల రెండు కాదల్ చిత్రం ను విఘ్నేష్ శివన్, నయన తార మరియు లలిత్ కుమార్ లు నిర్మించడం జరిగింది.

సంబంధిత సమాచారం :