విజయ్ దేవరకొండ కి సమంత స్పెషల్ థాంక్స్!

Published on Apr 29, 2022 4:47 pm IST

సౌత్ ఇండియన్ సెన్సేషన్ హీరోయిన్ సమంత పుట్టిన రోజు సందర్భంగా టాలీవుడ్ హ్యండ్సం హీరో విజయ్ దేవరకొండ బర్త్ డే సర్ప్రైజ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. శివ నిర్వాణ దర్శకత్వంలో సమంత, విజయ్ దేవరకొండ జంటగా నటిస్తున్న చిత్రం షూటింగ్ కాశ్మీర్‌లో జరుగుతుంది. సమంత పుట్టినరోజు కావడంతో టీమ్ మొత్తం ఆమెకు సర్ ప్రైజ్ ప్లాన్ చేసి ఫేక్ సీన్ క్రియేట్ చేసింది. సన్నివేశం చిత్రీకరణ సమయంలో, సమంత దాదాపు కన్నీళ్లు పెట్టుకుంది. మరియు ఆ సమయంలో విజయ్ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ, సమంత కి శుభాకాంక్షలు చెప్పాడు.

ఇదంతా వీడియోలో అందంగా కనిపిస్తోంది. మరియు సామ్ థ్రిల్‌ ఫీల్ అయ్యి, ఇచ్చిన ఎక్స్ ప్రెషన్స్ వెలకట్టలేనిది. ఈ వీడియో ను షేర్ చేస్తూ విజయ్ దేవరకొండ సోషల్ మీడియా ద్వారా విషెస్ తెలిపారు. ఇందుకు హీరోయిన్ సమంత స్పందిస్తూ స్వీటెస్ట్ సర్ప్రైజ్ అంటూ చెప్పుకొచ్చారు. చాలా ఫ్రీజ్ అయి ఉన్నాం, ఎంతో వర్క్ ఉన్నప్పటికీ, ఈ సర్ప్రైజ్ ఇవ్వడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ థాంక్స్ తెలిపారు సమంత.

సంబంధిత సమాచారం :