సమంత చేతుల మీదుగా విజయ్ సినిమా పాట విడుదల !

25th, January 2018 - 04:52:59 PM

తమిళ హీరో విజయ్ ఆంటోనీ తెలుగు ప్రేక్షకులకు సుపరిచుతుడే. ‘బిచ్చగాడు, డా.సలీం, నకిలీ, భేతాళుడు’ వంటి విభిన్నమైన సినిమాల్తో ప్రేక్షకుల్ని అలరించిన ఈయన ఇప్పుడు ‘కాశి’ పేరుతో ప్రేక్షకులను త్వరలో పలకరించనున్నాడు. ఈ సినిమాలో మొదటి పాట ‘అందమా’ ను స్టార్ హీరోయిన్ సమంత ఈరోజు సాయంత్రం 6 గంటలకు రిలీజ్ చేయనున్నారు.

తమిళంలో ‘కాళి’ పేరుతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని కిరుతిగ ఉదయనిధి డైరెక్ట్ చేస్తుండగా విజయ్ ఆంటోనీ తన ఫాతిమా ఫిలిం కార్పొరేషన్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఆఖరి దశ పనుల్లో ఉన్న ఈ చిత్రం తమిళ, తెలుగు భాషల్లో ఒకేసారి మార్చి నెలలో రిలీజ్ కానుంది. ఈ చిత్రానికి స్వయంగా విజయ్ ఆంటోనీ సంగీతాన్ని అందించారు.