సమంత కాదు, పూజా హెగ్డేనే హీరోయిన్ !

Published on Jan 3, 2022 6:00 pm IST

సూపర్ స్టార్ మహేష్ బాబు – త్రివిక్రమ్ కలయికలో రాబోతున్న క్రేజీ సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డేను ఫైనల్ చేశారు. అయితే, ఆ హీరోయిన్ ప్లేస్ లో సమంతను ఫిక్స్ చేశారని ఇప్పటికే వార్తలు వచ్చాయి. కానీ ఆ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని తెలుస్తోంది. ఈ సినిమాలో కేవలం పూజా హెగ్డే మాత్రమే హీరోయిన్ గా నటిస్తోంది.

ఇక ఫిబ్రవరి ఫస్ట్ వీక్ నుంచి ఈ సినిమా షూట్ స్టార్ట్ చేస్తారట. అన్నట్టు పదకొండు సంవత్సరాల తరువాత మహేష్ – త్రివిక్రమ్ కలయికలో సినిమా వస్తుండే సరికి ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. పైగా ఎన్టీఆర్ తో ‘అరవింద సమేత, అల్లు అర్జున్ తో ‘అల వైకుంఠపురములో’ వంటి వరుస హిట్ చిత్రాలను అందించాడు దర్శకుడు త్రివిక్రమ్. అందుకే ఈ సినిమాకి రెట్టింపు ఎక్స్ పెటేషన్స్ ఉన్నాయి. కాగా హారికా హాసిని క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మించిబోతుంది.

సంబంధిత సమాచారం :