కడప దర్గాను దర్శించుకున్న సమంత !

Published on Dec 12, 2021 9:02 pm IST

సమంత కడప నగరంలో ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా కొత్తగా ఏర్పాటు చేసిన మాంగల్య షాపింగ్ మాల్‌ ను స్టార్ట్ చేశారు. ఈ సందర్భంగా సమంత మాట్లాడుతూ.. ’11వ షాపింగ్ మాల్‌ ను నేను కడపలో ప్రారంభించడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. మాంగల్య షాపింగ్ మాల్‌ ను తెలంగాణలో మొదట నేనే ప్రారంభించాను.

ఇప్పుడు సమంత చేతుల మీదుగా ఆంధ్రప్రదేశ్‌ లో కూడా మొదటి మాంగల్య షాపింగ్ మాల్ ను కడపలో ఏర్పాటు చేశారు. ఇక సమంతను చూసేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలి వచ్చారు. అయితే, ఆ ప్రజలను నిలువరించడం పోలీసులకు కష్టం అయింది. సమంతను చూసి అభిమానులు కేరింతలు కొట్టారు.

ఇక షాపింగ్‌ మాల్‌ ఓపెనింగ్‌ అనంతరం సమంత కడపలోని పెద్ద దర్గాను దర్శించుకుని, చాదర్‌ ను సమర్పించారు. ఆ తర్వాత సమంతతో దర్గా పెద్దలు ప్రత్యేక ప్రార్థనలు చేయించారు.

సంబంధిత సమాచారం :