‘విజయ్ దేవరకొండ’కి సమంత ప్రత్యేక విషెస్ !

Published on May 9, 2022 11:48 am IST

సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ హీరోగా సమంత హీరోయిన్ గా శివ నిర్వాణతో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. నేడు విజయ్ దేవరకొండ పుట్టినరోజు. ఈ సందర్భంగా సినీ ప్రముఖులు విజయ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడానికి పోటీ పడుతున్నారు. తాజాగా విజయ్ బర్త్ డే సందర్భంగా సమంత కూడా సోషల్ మీడియాలో విషెస్ తెలియజేస్తూ ఒక పోస్ట్ పెట్టింది.

ఆ పోస్ట్ లో ఏమి పెట్టింది అంటే.. ‘లైగర్ విజయ్ దేవరకొండ మీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఈ ఏడాది రాబోతున్న ప్రశంసలకు నువ్వు సంపూర్ణ అర్హుడివి. విజయ్ నువ్వు ఎందరికో స్ఫూర్తిదాయకం, ప్రేరణ. గాడ్ బ్లెస్ యూ’ అని ఒక స్పెషల్ ఫోటోను పోస్ట్ చేస్తూ మెసేజ్ పెట్టింది. ఇక విజయ్ – సమంత కాంబినేషన్‌ లో విజయ్ దేవరకొండ 11 షూటింగ్‌ జరుగుతోంది.

సంబంధిత సమాచారం :