అభిమానులను అలరించేందుకు కష్టపడుతోన్న సమంత!

అభిమానులను అలరించేందుకు కష్టపడుతోన్న సమంత!

Published on Nov 1, 2022 10:35 PM IST

సౌత్ స్టార్ హీరోయిన్ సమంత కొన్ని రోజుల క్రితం తన ఆరోగ్య విషయాన్ని బయటపెట్టి అందరినీ షాక్ చేసింది. తన కొత్త చిత్రం యశోద నవంబర్ 11న గ్రాండ్ రిలీజ్ కానుంది, మేకర్స్ దానిని శరవేగంగా ప్రమోట్ చేస్తున్నారు. సరోగసీ స్కామ్ చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది. ఈరోజు, యాక్షన్ బ్లాక్‌ల కోసం నటి పడిన కష్టాన్ని చూపించే వీడియోను చిత్ర యూనిట్ విడుదల చేయడం జరిగింది.

తన అభిమానులను ఆశ్చర్యపరిచేందుకు స్టార్ హీరోయిన్ తన బెస్ట్ ను ఈ వీడియో లో మనం చూడవచ్చు. యానిక్ బెన్ అనే యాక్షన్ కొరియోగ్రాఫర్, సమంత చాలా అంకితభావంతో ఉందని మరియు అలాంటి కళాకారులతో పనిచేయడం తనకు ఇష్టమని చెప్పారు. యాక్షన్ సీన్స్ రియలిస్టిక్ గా ఉండేలా చిత్రబృందం ప్రయత్నిస్తుండగా, సమంత ఈ సినిమాతో మరోసారి ప్రేక్షకుల మనసు దోచేందుకు సిద్ధమైంది. ఈ పాన్ ఇండియన్ చిత్రానికి హరి మరియు హరీష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్‌కుమార్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు