సమంత ‘యశోద’ డే 1 వసూళ్లు ఎంతంటే ?

సమంత ‘యశోద’ డే 1 వసూళ్లు ఎంతంటే ?

Published on Nov 12, 2022 4:46 PM IST

స్టార్ నటి సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన లేటెస్ట్ థ్రిల్లింగ్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీ యశోద. ఈ మూవీని హరి, హరీష్ ద్వయం కలిసి తెరకెక్కించగా శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై శివలెంక కృష్ణప్రసాద్ ఎంతో గ్రాండ్ గా పాన్ ఇండియా స్థాయిలో నిర్మించారు. ఇంకా ఈ మూవీలో ఉన్ని ముకుందన్, వరలక్ష్మి శరత్ కుమార్, మురళి శర్మ, రావు రమేష్, సంపత్ రాజ్ వంటి వారు కీలక పాత్రలు చేయగా మణిశర్మ మ్యూజిక్ అందించారు.

ఇక యశోద మూవీ మంచి అంచనాలతో నిన్న ప్రేక్షకుల ముందుకి వచ్చి హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. కాగా తమ మూవీకి ఫస్ట్ డే వరల్డ్ వైడ్ రూ. 6.32 కోట్ల గ్రాస్ కలెక్షన్ లభించినట్లు కొద్దిసేపటి క్రితం యూనిట్ అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. ఇక ఈ సినిమాలో యశోద పాత్రలో సూపర్ గా పెర్ఫార్మన్స్ కనబరిచిన సమంత పై అందరి నుండి మంచి ప్రసంశలు కురుస్తున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు