యుఎస్ఏ లో సమంత ‘యశోద’ డే 1 కలెక్షన్స్ ఎంతంటే ?

యుఎస్ఏ లో సమంత ‘యశోద’ డే 1 కలెక్షన్స్ ఎంతంటే ?

Published on Nov 13, 2022 3:00 AM IST


సమంత ప్రధాన పాత్రలో ఉన్నిముకుందన్, మురళి శర్మ, వరలక్ష్మి శరత్ కుమార్, సంపత్ రాజ్, రావు రమేష్, దివ్యశ్రీపాద, కల్పిక గణేష్, ప్రియాంక శర్మ తదితరులు కీలక పాత్రల్లో తెరకెక్కిన తాజా సినిమా యశోద. శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై రూపొందిన ఈ మూవీకి మణిశర్మ సంగీతం అందించారు. సర్రోగసి నేపథ్యంలో సాగే సైన్స్ ఫిక్షన్ యాక్షన్ ఎమోషనల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీలో టైటిల్ రోల్ పోషించారు సమంత. ఇక రెండు రోజుల క్రితం మంచి అంచనాలతో ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఈ మూవీ అన్ని వర్గాల ఆడియన్స్ ని ఆకట్టుకుని పాజిటివ్ టాక్ తో మంచి కలెక్షన్స్ తో కొనసాగుతోంది. ఇక ఈ మూవీ అటు యుఎస్ఏ లో సైతం దూసుకెళ్తుండడం విశేషం.

కాగా యశోద మూవీ యుఎస్ ఏ లో డే 1, 260కె డాలర్స్ కలెక్షన్ ని సొంతం చేసుకున్నట్లు కొద్దిసేపటి క్రితం అక్కడి డిస్ట్రిబ్యూటర్స్ అయిన రాధాకృష్ణ ఎంటర్టైన్మెంట్స్ వారు అధికారికంగా ప్రకటించారు. అలానే ఈ వారాంతంలో యశోద మరింతగా కలెక్షన్ అందుకునే అవకాశం ఉందని, ముఖ్యంగా ఫ్యామిలీస్ ఈ మూవీకి బాగా కనెక్ట్ అవుతున్నారని వారు అంటున్నారు. మొత్తంగా ఆడియన్స్ అంచనాలు అందుకుని దూసుకెళ్తున్న యశోద మూవీ రాబోయే రోజుల్లో ఇంకెంత మేర కొల్లగొడుతుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు