సమంత ‘యశోద’ ఓవర్సీస్ రైట్స్ ఎవరికంటే ?

సమంత ‘యశోద’ ఓవర్సీస్ రైట్స్ ఎవరికంటే ?

Published on Oct 29, 2022 7:58 PM IST


సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన లేటెస్ట్ థ్రిల్లింగ్ యాక్షన్ మూవీ యశోద. శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై ఎంతో భారీ స్థాయిలో పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కిన ఈ ఈమూవీని యువ దర్శకులు హరి, హరీష్ కలిసి సంయుక్తంగా తీశారు. మణిశర్మ సంగీతం అందించిన యశోద నుండి ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్, థియేట్రికల్ ట్రైలర్ ఇలా అన్ని కూడా మూవీ పై ప్రేక్షకాభిమానుల్లో విపరీతమైన అంచనాలు ఏర్పరిచాయి. సర్రోగసి కథాంశంతో కుట్రలు, స్కాములతో అల్లుకున్న థ్రిల్లింగ్ మూవీగా యశోద తెరకెక్కింది.

ఇక ఈ మూవీ నవంబర్ 11న భారీ స్థాయిలో పలు భాషల్లో ఆడియన్స్ ముందుకి రానుండగా ఈ మూవీ యొక్క ఓవర్సీస్ హక్కులని రాధాకృష్ణ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఇండియాతో పాటు ఓవర్సీస్ లో కూడా సమంత కి హీరోయిన్ గా మంచి క్రేజ్ ఉండడంతో పాటు, సినిమాకి అక్కడ కూడా బాగా హైప్ రావడంతో రిలీజ్ తరువాత యశోద అక్కడ కూడా మంచి కలెక్షన్ రాబడుతుందని అంటోంది యూనిట్. అలానే తప్పకుండా యశోద మంచి విజయం అందుకుని తామందరి కష్టానికి తగ్గ ఫలితాన్ని ఇస్తుందనే నమ్మకాన్ని వారు వ్యక్తపరుస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు