టాప్ లో ట్రెండ్ అవుతున్న సమంత ‘యశోద’ ట్రైలర్

టాప్ లో ట్రెండ్ అవుతున్న సమంత ‘యశోద’ ట్రైలర్

Published on Oct 28, 2022 8:00 PM IST


సమంత ప్రధాన పాత్రలో శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై ప్రస్తుతం తెరకెక్కిన భారీ పాన్ ఇండియన్ మూవీ యశోద. యువ దర్శకులు హరి, హరీష్ కలిసి తెరకెక్కించిన ఈ మూవీ యొక్క ఫస్ట్ లుక్ టీజర్, పోస్టర్స్ ఇటీవల అందరినీ ఎంతో ఆకట్టుకుని మూవీ పై మంచి అంచనాలు ఏర్పరిచాయి. యాక్షన్ థ్రిల్లింగ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన యశోద మూవీ థియేట్రికల్ ట్రైలర్ ని నిన్న యువ నటుడు విజయ్ దేవరకొండ రిలీజ్ చేసారు. ట్రైలర్ ని బట్టి చూస్తే యశోద మూవీ ఒక డిఫరెంట్ థ్రిల్లింగ్ కాన్సెప్ట్ తో తెరకెక్కినట్లు తెలుస్తోంది. అలానే ట్రైలర్ లో సమంత యాక్టింగ్, డైలాగ్స్, ఫైట్స్, ఎమోషనల్ సన్నివేశాలు బాగున్నాయి.

మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో పాటు ఎమ్ సుకుమార్ అందించిన విజువల్స్ కూడా ఆకట్టుకున్నాయి. మొత్తంగా అన్ని వర్గాల ఆడియన్స్ ని ఆకట్టుకున్న యశోద ట్రైలర్ ప్రస్తుతం యూట్యూబ్ లో టాప్ లో ట్రెండ్ అవుతుండడంతో యూనిట్ ఆనందం వ్యక్తం చేస్తోంది. పాన్ ఇండియా మూవీగా పలు భాషల్లో నవంబర్ 11న యశోద మూవీ ప్రేక్షకుల ముందుకి రానుంది. ఇంకా ఈ మూవీలో ఉన్ని ముకుందన్, వరలక్ష్మి శరత్ కుమార్, సంపత్ రాజ్, రావు రమేష్, మురళి శర్మ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు