థ్రిల్లింగ్, యాక్షన్ అంశాలతో ఆకట్టుకుంటున్న ‘యశోద’ ట్రైలర్

థ్రిల్లింగ్, యాక్షన్ అంశాలతో ఆకట్టుకుంటున్న ‘యశోద’ ట్రైలర్

Published on Oct 27, 2022 5:56 PM IST

సమంత ప్రధాన పాత్రలో యువ దర్శక ద్వయం హరి, హరీష్ కలిసి తెరకెక్కించిన తాజా మూవీ యశోద. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై శివలెంక కృష్ణ ప్రసాద్ ఎంతో భారీ వ్యయంతో ప్రతిష్టాత్మకంగా పాన్ ఇండియారేంజ్ లో తెరకెక్కించిన ఈ మూవీలో సమంత టైటిల్ రోల్ పోషించగా ఇతర పాత్రల్లో ఉన్ని ముకుందన్, సంపత్ రాజ్, రావు రమేష్, వరలక్ష్మి శరత్ కుమార్ నటించారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ మూవీ యొక్క ఫస్ట్ లుక్ టీజర్, పోస్టర్స్ అన్ని కూడా మూవీ పై మంచి అంచనాలు ఏర్పరచగా నేడు ఈ మూవీ యొక్క థియేట్రికల్ ట్రైలర్ ని పలువురు పాన్ ఇండియన్ హీరోలు విడుదల చేసారు. తెలుగు ట్రైలర్ ని యువ సెన్సేషనల్ నటుడు నటుడు విజయ్ దేవరకొండ కొద్దిసేపటి క్రితం రిలీజ్ చేసారు.

ఇక యశోద ట్రైలర్ ని పరిశీలిస్తే, ‘మీకు ఎప్పుడైనా రెండు గుండె చప్పుళ్ళు వినిపించాయా, ఒక బిడ్డని మోస్తున్న తల్లికి మాత్రమే ఆ విధమైన చప్పుడు వినిపిస్తుంది’ అంటూ ఇంట్రెస్టింగ్ డైలాగ్ తో ఈ ట్రైలర్ మొదలవుతుంది. ఇక ట్రైలర్ ని బట్టి చూస్తే ఈ మూవీ ఒక ఇంట్రెస్టింగ్ గా సాగే థ్రిల్లింగ్ కాన్సెప్ట్ తో తెరకెక్కినట్లు తెలుస్తోంది. అలానే ట్రైలర్ లో సమంత పలికే డైలాగ్స్, యాక్టింగ్, చేసే ఫైట్స్ ఎంతో బాగున్నాయి. మణిశర్మ బీజీఎమ్, ఎమ్ సుకుమార్ ఫోటోగ్రఫి, విజువల్స్ కూడా సూపర్ గా ఉంది. మొత్తంగా సమంత యశోద ట్రైలర్ ప్రస్త్తుతం ఆడియన్స్ ని ఆకట్టుకుంటూ యూట్యూబ్ లో మంచి వ్యూస్ తో దూసుకెళుతోంది. కాగా ఈ మూవీని అన్ని కార్యక్రమాలు ముగించి తెలుగు సహా పలు భాషల్లో నవంబర్ 11 న విడుదల చేయనున్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు