నన్ను నేను మార్చుకోవాలి – సమంత

Published on Oct 5, 2021 12:12 am IST

సమంత – నాగచైతన్య విడిపోవడం పై సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ గురించి తెలిసిందే. అయితే, విడాకుల ప్రకటన తర్వాత సమంత సోషల్ మీడియా మొదటి పోస్ట్ పెట్టింది. ‘ఈ ప్రపంచాన్ని మార్చాలనుకునే ముందు.. నన్ను నేను మార్చుకోవాలి. నా పడకగదిని సిద్ధం చేసుకోవాలి. నా ఇంటిని నేను పరిశుభ్రం చేసుకోవాలి. మధ్యాహ్నం వరకూ నిద్రపోకూడదు. అలాగే పగటి కలలు కనడం మానేయాలి. చేయాల్సిన పనుల పై దృష్టి పెట్టాలి’ అంటూ సమంత తన ఇన్‌ స్టా స్టోరీలో పోస్ట్ చేసింది.

ఇక చైతు – సామ్ మూడేళ్ళ పాటు ఘాడంగా ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. క్రేజీ కపుల్ గా టాలీవుడ్ లో గుర్తింపు కూడా దక్కింది. పైగా పెళ్లి తర్వాత ఇద్ద‌రి కెరీర్లూ వరుస సక్సెస్ ట్రాక్ లో పడ్డాయి. అయినా ఈ జంట‌ విడాకుల దిశగా వెళ్లడం ఆశ్చర్యకరమైన విషయమే. ఇక ప్రస్తుతం ఇద్దరు ఎవరి సినిమాలతో వాళ్ళు బిజీగా ఉన్నారు.

సంబంధిత సమాచారం :