హీరోయిన్స్ రెమ్యునరేషన్ పై సమంత ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Published on Mar 29, 2023 2:32 am IST


టాలీవుడ్ స్టార్ కథానాయిక సమంత రూత్ ప్రభు లేటెస్ట్ గా నటించిన శాకుంతలం మూవీ ప్రమోషన్స్ లో విరివిగా పాల్గొంటున్నారు. ఈ భారీ పాన్ ఇండియన్ మైథలాజికల్ మూవీలో శకుంతలగా ఆమె కనిపించనుండగా మలయాళ యాక్టర్ దేవ్ మోహన్ దుష్యంతుడిగా నటిస్తున్నారు. గుణశేఖర్ తెరకెక్కిస్తున్న ఈ భారీ మూవీని గుణా టీమ్ వర్క్స్ బ్యానర్ పై నీలిమ గుణా నిర్మిస్తుండగా దిల్ రాజు దీనిని సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. ఇక ఏప్రిల్ 14న గ్రాండ్ గా ఈమూవీ రిలీజ్ కానుండడంతో యూనిట్ ప్రమోషన్స్ పై గట్టిగా దృష్టి పెట్టింది. ఇక తాజగా ఒక ఇంటర్వ్యూ లో భాగంగా ఈ మూవీ గురించిన పలు విషయాలు వెల్లడించిన సమంత, హీరోయిన్స్ రెమ్యునరేషన్ పై ఒకింత ఇంట్రెస్టింగ్ గా వ్యాఖ్యానించారు.

నిజానికి ఇండస్ట్రీ లో నటీనటులకు సమానముగా రెమ్యునరేషన్ ఇవ్వాలని ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా తాను పోరాడుతున్నానని అన్నారు. ఇక హీరోయిన్స్ పడుతున్న కష్టాన్ని గుర్తించిన నిర్మాతలు దానికి తగ్గ విధంగానే రెమ్యునరేషన్ ఇస్తే బాగుంటుందని అన్నారు. అలాగని ఖచ్చితంగా మాకు ఇంత ఇవ్వాల్సిందేని డిమాండ్ చేయడంతో పాటు మాకు ఇంత ఇవ్వండి అంటూ యాచించాల్సిన అవసరం కూడా లేదని ఆమె అన్నారు. ప్రస్తుతం మూవీ ఇండస్ట్రీ లో ఎందరో హీరోయిన్స్ గొప్పగా కష్టపడుతున్నారని, రాబోయే రోజుల్లో భారతీయ సినిమా పరిశ్రమ మరింతగా వృద్ధి చెందాలని తాను ఆశిస్తున్నట్లు ఆమె తెలిపారు.

సంబంధిత సమాచారం :