‘యశోద’గా సమంత… షూటింగ్ ప్రారంభమైంది !

‘యశోద’గా సమంత… షూటింగ్ ప్రారంభమైంది !

Published on Dec 6, 2021 4:00 PM IST

సమంత ప్రస్తుతం వరుస సినిమాలను అంగీకరిస్తూ ఫుల్ బిజీగా ఉంది. అయితే తాజాగా సమంత ప్రధాన పాత్రలో శ్రీదేవి మూవీస్‌ పతాకంపై ప్రొడక్షన్ నంబర్ 14గా శివలెంక కృష్ణప్రసాద్‌ నిర్మిస్తున్న చిత్రానికి ‘యశోద’ టైటిల్ ఖరారు చేశారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ సోమవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ‘ఫ్యామిలీ మేన్ 2’ వెబ్ సిరీస్‌తో సమంతకు జాతీయ స్థాయిలో పేరొచ్చింది. ప్రస్తుతం సమంతకు ఉన్న క్రేజ్‌ కు తగ్గట్టు రూపొందుతున్న చిత్ర‌మిది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంతో పాటు హిందీ భాషలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

ఈ సందర్భంగా నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ మాట్లాడుతూ “సమంత ప్రధాన పాత్రలో నిర్మిస్తున్న హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ చిత్రమిది. బాలకృష్ణగారితో ‘ఆదిత్య 369’ తీశాను. ఆయనతో మరో మూడు చిత్రాలు చేశాను. నానితో ‘జెంటిల్‌మన్‌’, సుధీర్‌బాబుతో ‘సమ్మోహనం’ నిర్మించాను. ఇప్పుడు సమంత ప్రధాన పాత్రలో సినిమా చేస్తుండటం సంతోషంగా ఉంది. థ్రిల్లర్ జాన‌ర్‌లో నేషనల్ లెవ‌ల్‌లో ఆడియన్స్ అందరినీ ఆకట్టుకునే కథాంశంతో తీస్తున్న చిత్రమిది. మార్చితో చిత్రీకరణ పూర్తవుతుంది. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు” అని చెప్పారు. సమంతతో పాటు సినిమాలో నటించే ఇతర తారాగణం వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు