డిజిటల్ ప్రీమియర్ కి రెడీ అయిన సమంత “శాకుంతలం”?

డిజిటల్ ప్రీమియర్ కి రెడీ అయిన సమంత “శాకుంతలం”?

Published on May 7, 2023 6:40 PM IST

స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం శాకుంతలం. ఈ చిత్రం థియేటర్ల లో విడుదలై ప్రేక్షకులను అలరించడం లో విఫలం అయ్యింది. బాక్సాఫీస్ వద్ద కూడా మంచి వసూళ్లను రాబట్టలేకపోయింది. అయితే లేటెస్ట్ బజ్ ప్రకారం, శాకుంతలం అమెజాన్ ప్రైమ్ వీడియోలో మే 12, 2023 నుండి ప్రసారం కానుంది.

ప్రైమ్ వీడియో నుండి అధికారిక ప్రకటన ఇంకా విడుదల కాలేదు. శాకుంతలం చిత్రంలో అల్లు అర్జున్ కుమార్తె అర్హ అర్జున్ తొలిసారిగా నటించింది. ఈ చిత్రంలో మోహన్ బాబు, ప్రకాష్ రాజ్, అదితి బాలన్, గౌతమి, అనన్య నాగళ్ల, అల్లు అర్హా, కబీర్ దుహన్ సింగ్ ముఖ్య పాత్రలు పోషించారు. మణిశర్మ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని నీలిమ గుణ నిర్మించారు. సమంత ప్రస్తుతం సిటాడెల్ మరియు ఖుషీ చిత్రాలతో బిజీగా ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు