సమంతా “యశోద” రన్‌టైమ్ లాక్డ్!

సమంతా “యశోద” రన్‌టైమ్ లాక్డ్!

Published on Nov 4, 2022 12:00 PM IST

స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటించిన కొత్త చిత్రం యశోద. ఈ చిత్రం నవంబర్ 11, 2022 న థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కానుంది. హరి మరియు హరీష్ దర్శకత్వం వహించిన ఈ సినిమా లో ఉన్ని ముకుందన్ ముఖ్య పాత్రలో నటించారు. ఈ చిత్రానికి CBFC నుండి U/A సర్టిఫికేట్ లభించింది.

ఇప్పుడు లేటెస్ట్ సమాచారం ఏంటంటే, ఈ సినిమా 135 నిమిషాల రన్‌టైమ్‌ని కలిగి ఉంది. మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. పాన్ ఇండియా మూవీ గా వస్తున్న ఈ సినిమా లో వరలక్ష్మి శరత్‌కుమార్, రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్, కల్పికా గణేష్, దివ్య శ్రీపాద తదితరులు ప్రముఖ పాత్రలు పోషిస్తున్నారు. శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీత దర్శకుడు గా వ్యవహరిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు