వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కి సిద్ధమైన సమంత “యశోద”

Published on Jan 31, 2023 1:33 pm IST


స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో హారి హరీష్ దర్శకత్వం లో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ యశోద. ఉన్ని ముకుందన్, మురళి శర్మ, వరలక్ష్మీ శరత్ కుమార్, రావు రమేష్ లు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం గతేడాది థియేటర్ల లో విడుదల అయ్యి సూపర్ హిట్ సాధించింది. ఈ చిత్రం థియేటర్ల లో ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. అయితే ఈ చిత్రం ఇప్పుడు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లితెర ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అవుతోంది.

ఈ చిత్రం ఈటీవీ తెలుగు లో ఆదివారం సాయంత్రం 6:30 గంటలకు ప్రసారం కానుంది. శ్రీదేవి మూవీస్ పతాకంపై సివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు. ఈ చిత్రం బుల్లితెర పై ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం :