“ఎన్టీఆర్ 30” విషయంలో కొనసాగుతున్న సస్పెన్స్.!

Published on Sep 28, 2022 1:32 am IST

ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ క్రేజ్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్లిన సంగతి తెలిసిందే. తన లాస్ట్ సినిమా “రౌద్రం రణం రుధిరం” తర్వాత నార్త్ సహా ఓవర్సీస్ ఆడియెన్స్ లో కూడా మంచి ఫేమ్ అందుకున్న తారక్ తన నెక్స్ట్ సినిమా ఎంత త్వరగా చేసి రిలీజ్ చేస్తాడా అని అభిమానులు ఉవ్విళ్లూరుతున్నారు. అయితే ఎన్టీఆర్ నెక్స్ట్ దర్శకుడు కొరటాల శివ తో ఎన్టీఆర్ తన కెరీర్ లో 30వ సినిమాని ఓకే చేసాడు.

దీని నుంచి వచ్చిన మోషన్ పోస్టర్ టీజర్ కి కూడా సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈపాటికే స్టార్ట్ కావాల్సి ఉన్న ఈ చిత్రం పై మాత్రం ఇప్పటికీ అదే సస్పెన్స్ కొనసాగుతుంది. ఇప్పటికీ కూడా ఈ చిత్రం షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది కన్ఫర్మ్ కాలేదు. దీనితో ఫ్యాన్స్ కూడా క్లూ లెస్ గా ఉన్నారు. మరి ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేవి మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది. అయితే సినిమా మ్యూజిక్ వర్క్స్ మాత్రం బాగానే అవుతున్నట్టు టాక్.

సంబంధిత సమాచారం :